టాయిలెట్స్ శుభ్రపరిచి ఆదర్శంగా నిలిచిన విశాఖ జిల్లా కలెక్టర్

కలెక్టర్ అంటే ఆదేశాలు జారీచేయడమే కానీ ఆదర్శంగా నిలువడం అనేది చాల అరుదు. తాజాగా విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ తన హోదా ను పక్కన పెట్టి సామాన్య వ్యక్తి లాగా టాయిలెట్స్ శుభ్రపరిచి అందరికి ఆదర్శమయ్యారు.

వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా అడవివరం జడ్పీ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న టాయిలెట్ పరిశీలించారు. అనంతరం చీపురుపట్టి వాటిని శుభ్రం చేశారు. అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలకు శాలువా కప్పి వారిని గౌరవించారు.

ప్రతి విద్యార్థి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని.. వాటిని పెద్దలు, ఉపాధ్యాయుల సహాకారంతో సాధించే దిశంగా పయనించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ చేసిన పనికి అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.