తెలంగాణ లో క్రైమ్ రేటుఫై ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదికను తప్పుబట్టిన డీజీపీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి అభివృద్ధి లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా అతి తక్కువ సమయంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. వ్యవసాయం , ఐటి, పరిశ్రమలు ఇలా అది ఇది కాదు అన్నింట్లోనూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో సైబర్ నేరాల్లో కూడా తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) తెలుపడం అందర్నీ షాక్ కు గురిచేసింది.

దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందన్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల అవగాహన కోసమే కేసులు నమోదు చేసి అప్రమత్తం చేస్తున్నామని వివరణ ఇచ్చారు. సైబర్ క్రైమ్ కేసుల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉందని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని, సైబర్ నేరగాళ్లు ఝార్ఖండ్, బీహార్, బెంగాల్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.