కండలవీరుడ్ని కలిసిన దర్శక ధీరుడు

దర్శక ధీరుడు రాజమౌళి..బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను కలవడం ఇప్పుడు చర్చ గా మారింది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ పాన్ మూవీ తెరకెక్కించారు. ఎన్టీఆర్ , చరణ్ , అలియా భట్ , అజయ్ దేవగన్ తో పాటు పలువురు హాలీవుడ్ నటులు నటించిన ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే..ప్రమోషన్ కార్య క్రమాల ఫై జక్కన్న దృష్టి పెట్టారు. ఇదిలా ఉండగానే బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌ను రాజ‌మౌళి శుక్ర‌వారం రోజున ప్ర‌త్యేకంగా క‌లిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.సడెన్ గా జ‌క్క‌న్న ఎందుకు కలిశాడ‌నేది హాట్ టాపిక్‌గా మారింది.

వీరి కలయికపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటున్నారు. రాజ‌మౌళి త‌న RRR మూవీ ట్రైల‌ర్‌ను ముంబైలో నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ని, ఆ వేడుక‌కు స‌ల్మాన్‌ఖాన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించ‌డానిక‌నే వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిశార‌ని అంటున్నారు. అయితే కొంద‌రు మాత్రం జ‌క్క‌న్న‌, స‌ల్మాన్ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందేమోన‌ని అంటున్నారు. మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజం అనేది రాజమౌళినే చెప్పాలి.