గన్నవరం లో చంద్రబాబు భారీ షాక్..ఇదేమి ఖర్మ చంద్రబాబు అంటూ ఫ్లెక్సీలు

మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు కు గన్నవరం లో భారీ షాక్ తగిలింది. చంద్రబాబు కు వ్యతిరేకంగా హనుమాన్ జంక్షన్ వద్ద కొందరు ప్లెక్సీ లు ఏర్పటు చేసారు. డెల్టా షుగర్ ప్యాక్టరీని మూసివేయడం, మల్లవల్లి ఏపీఐఐసీ, గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు తీసుకుని అర్హులైన వారికి పరిహారం ఇవ్వలేదని , విజయవాడ ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణంలో ఓ రౌడీ షీటరు హోటల్ కూల్చకుండా రామవరప్పాడు కాల్వగట్లపై పేదల ఇళ్లు కూల్చారని ప్లెక్సీ లో పేర్కొన్నారు.

అలాగే హుదూద్ బాధితుల సాయం కోసం 50 లక్షలు విరాళంగా సేకరించి లోకేష్‌కు ఇస్తే మాయం చేశారని.. పోలవరం కాల్వ, బ్రహ్మ లింగం చెరువు అభివృద్ది అంటూ సామంత మంత్రితో మట్టి దోపిడీ చేసినందుకు.. లక్ష ఇళ్ల పట్టాలంటూ పేదలకు స్థలాలు ఇవ్వకుండా మోసం చేసినందుకు స్వాగతం పలకాల అంటూ ప్రశ్నించారు.

ఇక శుక్రవారం నూజీవీడు లో చంద్రబాబు ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జగన్ ఫై విమర్శల దాడి చేసారు. ‘క్విట్ జగన్.. సేవ్ ఏపీ’ నినాదంతో ముందుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ అనే సైతాను ఉన్నంత వరకు ఏపీలో అభివృద్ధి జరగదన్నారు. తాను తీసుకొచ్చిన మల్లవల్లి పారిశ్రామికవాడను పూర్తి చేసి ఉంటే 50 వేల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఒక్క అవకాశానికి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైస్సార్సీపీ నేతలు దొంగల ముఠాల్లా మారి ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు.