రేపు కర్నూల్ లో విరాట పర్వం ప్రీ రిలీజ్ వేడుక

‘విరాటపర్వం’..దగ్గుపాటి రానా , సాయి పల్లవి , ప్రియమణి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల డైరెక్షన్లో తెరకెక్కింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రం గత కొద్దీ నెలలుగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే అంకితమైంది. ఓటిటిలలో రిలీజ్ అవుతుందని పలుమార్లు వార్తలు వినిపించినప్పటికీ మేకర్స్ మాత్రం థియేటర్స్ లలోనే రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించి హమ్మయ్య అనిపించారు. ఈ సినిమాను జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రమోషన్ ఫై దృష్టి సారించారు.

రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ‘కర్నూలులో’ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టరును కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను తెలంగాణలో జరిగిన కొన్ని యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో రాబోతుండగా, రానా దగ్గుబాటి ఇందులో ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే నివేదా పేతురాజ్, సాయిచంద్, నందిదాతాస్త దితరులు నటిస్తుండగా, సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు.

All fans assemble.. 💥

Meet the team of #VirataParvam at the Trailer Launch event in Kurnool on June 5th 💥#VirataParvamOnJune17th@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm #SureshBobbili #DivakarMani @dancinemaniac @SureshProdns @SLVCinemasOffl @LahariMusic pic.twitter.com/PSZ7YyOOA4— v e n u u d u g u l a (@venuudugulafilm) June 4, 2022