మేజర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా వచ్చాయంటే

మొదటి నుండి విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న నటుడు అడివి శేష్..తాజాగా మేజర్ మూవీ తో నిన్న( జూన్ 03 న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. శేష్ ఈ మూవీ లో హీరోగా నటించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు.

శశి కిరణ్ తిక్క ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించగా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబట్టడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 1.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 51 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 30 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 4.07 కోట్లు షేర్, రూ. 6.85 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.35 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 35 లక్షలు వచ్చాయి. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 7.12 కోట్లు షేర్‌తో పాటు రూ. 13.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.