ఇలా మొదలెట్టి అలా పూర్తి చేసిన వెంకీ

మలయాళంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం’ అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు రీమేక్‌గా వచ్చిన తెలుగు ‘దృశ్యం’ మూవీ కూడా ఇక్కడ అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఇక ఇటీవల దృశ్యం-2 చిత్రం కూడా మలయాళంలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకంది. దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేశారు. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

తెలుగులో దృశ్యం చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా, సీక్వెల్ చిత్రంలోనూ ఆయన్నే కొనసాగిస్తున్నారు. ఇక ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ను విక్టరీ వెంకటేష్ తాజాగా పూర్తి కూడా చేశాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఎలాంటి గ్యాప్ లేకుండా వెంకటేష్ పాల్గొనడంతో, ఈ సినిమాను ఇంత త్వరగా పూర్తి చేశామని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. కరోనా మరోసారి విజృంభిస్తున్నా, తమ చిత్ర యూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిందని దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా మీనా నటిస్తుండగా, దృశ్యం చిత్రంలో పాల్గొన్న నటీనటులే ఈ సీక్వెల్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఇంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న వెంకటేష్, దృశ్యం 2 చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.