వాల్తేర్ వీరయ్య విషయంలో కొరటాల సలహా తీసుకున్న బాబీ

డైరెక్టర్ బాబీ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వచ్చిన వాల్తేర్ వీరయ్య మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మొదటి ఆట తోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం , మెగాస్టార్ చిరంజీవి కామెడీ , యాక్షన్ , డాన్స్ ఇలా అన్ని సరిగ్గా సెట్ అవ్వడం తో మెగా అభిమానులు ఫుల్ ఖుషి గా ఫీల్ అయ్యారు. వారం తిరిగే లోపే రూ. 150 కోట్లు రాబట్టిన ఈ మూవీ రూ. 200 కోట్ల వైపు పరుగులు పెడుతుంది.

ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ఇంటర్వూస్ తో ఫుల్ బిజీ లో ఉన్నారు. ఇక డైరెక్టర్ బాబీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తన అసిస్టెంట్స్ కంటే అలాగే మిగతా వారికంటే ముందుగా రవితేజను తీసుకోవాలా వద్దా అని కొరటాల శివ ను అడిగినట్లుగా చెప్పుకొచ్చాడు. కథ ప్రకారం అయితే అతను కరెక్ట్ గా సెట్ అవుతాడు అని కొరటాల శివ కూడా బాబీకి సపోర్టుగా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా బాగా అనిపించింది అని కొరటాల శివ గారు తనకు చాలా బాగా సన్నిహితులు అని కూడా ఈ దర్శకుడు వివరణ ఇచ్చాడు.

అలాగే ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్ ను సముద్రం నేపథ్యంలో తీశాము. షాట్ అనుకున్న విధంగా రావడం కోసం చిరంజీవి గారు 10 రోజుల పాటు నీళ్లలో తడిశారు. అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఉండటం కోసం ఆయన అంతగా కష్టపడ్డారు అని తెలిపాడు. చిరంజీవిగారు అందరితోను ఆభిమానంగాను .. ప్రేమగాను ఉంటారు. ఎవరు కష్టపడితే ఆయన వారిని ఇష్టపడతారు. అభిమానినని చెప్పుకోవడం .. ఆయన కనపడగానే కాళ్లపై పడటం వలన కాదు, కష్టపడితేనే ఆయన మనసును గెలుచుకోగలం అనే విషయం నాకు అర్థమైంది అని తెలిపాడు.