హర్భజన్ సింగ్ బౌలింగ్ చూసి ఫిదా అయ్యా
ఈడెన్ గార్డెన్లో 13 వికెట్లు తీసిన హర్భజన్‌ను చూసి లవ్‌ఎట్ ఫస్ట్సైట్గా అనిపించింది

ముంబయి: ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చూసి ఫిదా అయ్యానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఆ సమయంలో హర్భజన్ చూసి లవ్ ఎట్ ఫస్ట్సైట్గా అనిపించిందని గంగూలీ అన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో గెలిచిన ఆ టెస్టు మ్యాచ్ భారత క్రికెట్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. వీవీఎస్ లక్ష్మణ్ (59,281) హర్భజన్ సింగ్ (7/123, 6/73) అదరగొట్టారు. అలనాటి మధురానుభూతులు గంగూలీ తాజాగా గుర్తుచేసుకున్నారు. లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ అని అందరు అంటారు. ఈడెన్‌లో 13 వికెట్లు తీసిన హర్భజన్‌ను చూస్తే అలాగే అనిపించింది. భజ్జీ బౌలింగ్ చూసి ఫిదా అయ్యా. భారత క్రికెట్లో అతడు మార్పు తెస్తాడని అప్పుడే నమ్మకం కుదిరింది. ఆ తర్వాత అతను 700 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ 700 వికెట్లు తీయడంతో ఆశ్చర్యపోలేదు అని గంగూలీ అన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/