మెస్సిపై రెండు మ్యాచ్‌ల నిషేధం
బార్సిలోనా జట్టు తరఫున ఆడుతూ రెడ్ కార్డ్‌కు గురవడం ఇదే మొదటిసారి

మాడ్రిడ్: లయనల్ మెస్సి… వర్తమాన ఫుట్‌బాల్ ఆటగాళ్లలో మేటి. ఎంత గొప్ప ఆటగాడైనా తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు. స్పానిష్ సూపర్ కప్ ఫైనల్లో ప్రత్యర్ధి ఆటగాడిని అభ్యంతరకరంగా అడ్డుకున్న మెస్సి రెడ్‌కార్డ్‌కు గురై ఆటనుంచి తప్పుకున్నాడు.
అదే బార్సిలోనా జట్టు పరాజయానికి కారణమైంది. మెస్సి ప్రవర్తనపై అంపైర్లు ఫిర్యాదు చేయడంతో స్పానిష్ సోకర్ సమాఖ్య కాపింటిషన్ కమిటీ విచారణ నిర్వహించి రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టింది. గత ఆదివారం అథ్లెటిక్ బిల్బావొ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మెస్సి ప్రత్యర్ధి ఆటగాడు అసిర్ విలాలిబర్ను ముఖంపై తగిలేలా చేతిని విసిరాడు.
దానితో విలాలిబర్ కిందపడిపోయాడు. అంపైర్ వెంటన్ వీడియో రివ్యూ పరిశీలించి మెస్సికి రెడ్ కార్డ్ చూపించాడు. బార్సిలోనా జట్టు తరఫున ఆడుతూ మెస్సి రెడ్ కార్డ్‌కు గురవడం ఇదే మొదటిసారి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/