మెక్సికోలో దేశాధ్యక్షుడు దిగిపోవాలంటూ మహిళలు ఆందోళన

మెక్సికో: మెక్సికోలో మహిళలు తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాధ్యక్షుడు దిగిపోవాలంటూ ఆందోళనకు దిగారు. ఒక్కసారి పెద్ద సంఖ్యలో మహిళలు రాష్ట్రపతి భవన్‌ను చుట్టుముట్టడంతో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణలో దాదాపు 62 మంది పోలీసులు సహా 81 మంది గాయపడ్డారు.

మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా మెక్సికో అతివలు నడుం బిగించా అతిపెద్ద ప్రదర్శనకు దిగారు. లైంగికదాడికి పాల్పడిన తమ పార్టీ నాయకుడిని దేశాధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ సమర్థించడంతో ఆ దేశ మహిళల్లో కోపం కట్టలు తెంచుకున్నది. అతని వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఓబ్రాడోర్ దేశాధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి భవన్ (నేషనల్ ప్యాలెస్) ను ముట్టడి చేయడానికి మహిళలు పెద్ద సంఖ్యలో ప్రదర్శన వచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/