వినాయకచవితి కథ చెప్పిన మోహన్‌బాబు

తనకు బాగా ఇష్టమైన పండుగ ఇదేనన్న మోహన్ బాబు

YouTube video
Vinayaka Chavithi Katha (Story) in Telugu by Dr. M Mohan Babu

హైదరాబాద్‌: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు రేపు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు స్పందిస్తూ, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ వినాయకచవితి అని తెలిపారు. ప్రతి ఏడాది కుటుంబ సభ్యులతో పాటు కొందరు మిత్రులను కూడా ఇంటికి పిలిచి వినాయక చవితి మంత్రాలు, విఘ్వేశ్వరుడి కథ వినిపించడం తనకు అలవాటు అని, ఆ అలవాటును అందరికీ వినిపించాలని తన పెద్ద కుమారుడు విష్ణు సూచించాడని మోహన్ బాబు వెల్లడించారు. అందుకే ఓ వీడియోలో వినాయకుడి కథ చెప్పి, దాన్ని అందరికీ వినిపిస్తున్నానని వివరించారు. ఈ వీడియోను మంచు విష్ణు తన యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారు. కాగా ఈవీడియోలో మోహన్ బాబు తన గొంతుకతో వినిపించిన వినాయక చవితి కథను వినిపించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/