భార‌త్‌తో యుద్ధం జరి‌గితే అణు‌బాం‌బు‌లతో దాడి

అణ్వాయుధాలు మినహా మరో మార్గం లేదన్న మంత్రి రషీద్

Pakistan Minister Sheikh Rashid

ఇస్లామాబాద్‌: పాకి‌స్థాన్‌ ఫెడ‌రల్‌ రైల్వే‌శాఖ మంత్రి షేక్‌‌ర‌షీద్‌ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. భార‌త్‌తో యుద్ధం జరి‌గితే అణు‌బాం‌బు‌లతో దాడి‌చే‌స్తా‌మని అన్నారు. ఇండియాతో అణుయుద్ధం వస్తుందని, అయితే, తమ ఆయుధాలు ముస్లింల ప్రాణాలను కాపాడేలా కొన్ని లక్షిత ప్రాంతాల్లోకే వెళతాయని రషీద్ వ్యాఖ్యానించారు. తమ వద్ద చాలా తక్కువ ఆయుధాలు ఉన్నాయని, అయితే, అవి పరిపూర్ణమైనవని అభివర్ణించారు. అసోంపైకి కూడా ఆయుధాలను పంపించే సత్తా తమకు లభించిందని చెప్పారు.

భారత్‌తో మరోసారి యుద్ధం జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని అన్న ఆయన, మరోసారి యుద్ధం సంభవిస్తే, అది సంప్రదాయ యుద్ధంగా మాత్రమే మిగలబోదని, మొదలుపెడితే అది అంతమే అవుతుందని అన్నారు. భార‌త్‌పై రెచ్చ‌గొట్టే వ్యాఖ్యలు చేయటం రషీ‌ద్‌కు కొత్తేమీ కాదు. పాక్‌ ప్రభు‌త్వంలో ఆయ‌నను ఐఎ‌స్‌ఐ గొంతు‌కగా భావి‌స్తారు. 2019లో పాకిస్థాన్ వ‌ద్ద 125 నుంచి 250 గ్రాముల అణ్వాయుధాలు ఉన్నాయ‌ని, నిర్దేశిత ల‌క్ష్యాల‌ను అవి విచ్చిన్నం చేస్తాయ‌ని ప్ర‌క‌టించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/