మా గ్రామాలను తెలంగాణాలో కలపాలంటూ రోడ్డెక్కిన గ్రామస్థులు

తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు ఏపీ ప్రభుత్వానికి వినతి పత్రం అంజేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపిన సమయంలో ఈ ఐదు గ్రామాలను సైతం విలీనం చేశారు. ఇప్పుడు ఐదు గ్రామాలు తెలంగాణ లో కలపాలంటూ ఆయా గ్రామాల ప్రజలు రోడ్లపై నిరసన తెలుపుతున్నారు. విలీన గ్రామాల్లో రాస్తోరోకో లు చేయాలని పిలుపునివ్వగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాస్తారోకో లను నిషేధించింది. వరదలు నేపథ్యంలో ఆందోళన చేయటానికి వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేయడంతో విలీన గ్రామాల ప్రజలు భద్రాచలం సమీపంలో రాస్తా రోకో లు చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో భద్రాచలం ఎమ్మెల్యే పోదాం వీరయ్య పాల్గొని మద్దతు పలికారు.

ఇదిలా ఉంటె తెలంగాణ తో పాటు ఎగువ రాష్ట్రాల్లో గత వారం కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం పట్టణంలోని పలు కాలనీ లతో పాటు చాల గ్రామాలూ నీటమునిగాయి. ఈ క్రమంలో మరోసారి గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుందని అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయిస్తే ఆయా ఊర్ల నుంచి కరకట్ట నిర్మించి.. గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణానికి శాశ్వతంగా రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలో ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఏపీకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పట్టణానికి ముంపు లేకుండా ఉండేందుకు ఆయా గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలన్నారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల పంచాయతీలు తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేసి, ఏపీ ప్రభుత్వానికి పంపాయి. ఇప్పటికే పువ్వాడ విన్నపానని తోసిపొచ్చిన ఏపీ మంత్రులు..గ్రామాల విన్నపంఫై ఏమంటారో చూడాలి.