తెలంగాణ

రాజకీయ జీవితానికి 24 ఏళ్లు పూర్తి : విజయశాంతి

1998 జనవరి 26న బీజేపీలో చేరిన రాములమ్మ

vijayashanthi

హైదరాబాద్: విజయశాంతి తన రాజకీయ ప్రస్థానంపై సోషల్ మీడియాలో స్పందించారు. నిన్నటితో తన రాజకీయ జీవితానికి 24 ఏళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. తాను 1998 జనవరి 26న రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం 25వ పడిలోకి ప్రవేశించిన సందర్భంగా తనకు అభినందనలు, శుభాశీస్సులు తెలియజేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు వినమ్రంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. మీ అందరి ఆదరాభిమానాలను ఎప్పటికీ ఇలాగే నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

ఇక ఆమె రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే.. విజయశాంతి మొదట బీజేపీలో చేరారు. తదనంతర కాలంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బీజేపీ నుంచి తప్పుకుని 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తన పార్టీని టీఆర్ఎస్ లో కలిపేశారు. 2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి ఎంపీ అయ్యారు. కొన్ని ప్రతికూల పరిణామాలతో ఆమె టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. 2014లో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి అక్కడా ఇమడలేకపోయారు. 2020లో మళ్లీ బీజేపీ గూటికే చేరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/

Suma Latha

Recent Posts

మహబూబాబాద్ జిల్లా యువకుడికి ఆర్ధిక సాయం చేసిన గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళి సై తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న మహబూబాబాద్ జిల్లా యువకుడికి ఆర్ధిక…

5 mins ago

దావోస్ పర్యటన లో రాష్ట్రానికి 4200 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజవంతంగా పూర్తి అయ్యింది. ఈనెల 18 లండన్ కు చేరుకున్న కేటీఆర్,…

16 mins ago

ఎన్టీఆర్ ఘాట్ వద్ద దగ్గుబాటి పురందేశ్వరి భావోద్వేగం

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జయంతి వేడుకలు…

38 mins ago

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించిన జూ. ఎన్టీఆర్

నేడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా జూ. ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకొని…

54 mins ago

ష్యోక్ నదిలో బోల్తా పడిన ఆర్మీ వాహ‌నం.. ఏడుగురు జ‌వాన్ల మృతి ..

7 soldiers killed after army vehicle falls into Shyok river in శ్రీన‌గ‌ర్ : ల‌ద్దాఖ్‌లోని ష్యోక్…

17 hours ago

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 632…

17 hours ago