కష్టపడి పైకి వచ్చాం .. ఎవర్నీ మోసం చేయలేదు

మాజీ మంత్రి ‘ఈటల’ సతీమణి జమున

Etala Rajender-Jamuna
Etala Rajender-Jamuna

Hyderabad: తాము కష్టపడి పైకి వచ్చామని.. ఎవర్నీ మోసం చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున అన్నారు. జమున హ్యాచరీస్, గోదాంలపై ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవవని , వాటిని తిప్పికొట్టడం తమకు తెలుసు అని అన్నారు. మాసాయిపేటలో మోడ్రన్‌ హ్యాచరిస్ పెట్టాలని 46 ఎకరాలు కొన్నామని, బడుగు బలహీనవర్గాల భూమి కాజేశామని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. . నిజాలు ఎప్పటికైనా బయటపడతాయని, పత్రిక కోసం భూమి ఇచ్చిన కుటుంబం తమదని పేర్కొన్నారు. ఎకరం కొన్నా.. ప్రభుత్వం, ముఖ్యమంత్రికి చెప్పే కొనుగోలు చేశామని, సర్వే చేయొద్దని అధికారులకు తాము చెప్పలేదని అన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/