చంద్రబాబు ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చుః విజయసాయి రెడ్డి సెటైర్లు

పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చని ఎద్దేవా

Vijayasai Reddy
Vijayasai Reddy

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారు కట్టే రాఖీ కట్టుకుంటే ఇంటర్ లో బైపీసీ చదివి ఇంజినీర్ కావచ్చని ఆయన ఎద్దేవా చేశారు. పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చని అన్నారు. ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చని చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పొల్గొనవచ్చని అన్నారు. అది నేనే కట్టా, ఇది నేనే పెట్టా అని మాట్లాడొచ్చని వ్యాఖ్యానించారు. ట్విట్టర్ (X) వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.