నీ ఉంగరంలో చిప్ ఉందా..? విజయసాయి రెడ్డి సెటైర్లు

vijayasai reddy satires on chandrababu ring

తన చేతి ఉంగరం లో కంప్యూటర్ చిప్ ఉందని చంద్రబాబు చెప్పిన దానికి వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి సెటైర్లు వేశారు. నీ ఉంగరంలో చిప్ ఉందా..ముసలినాయుడు ? ఏమన్నావ్ చీప్ ట్రిక్స్ ముసలినాయుడు? నీ ఉంగరంలో చిప్ ఉందా? ఎవరేం చేసేది, ఎప్పుడు నిద్రపోయేది, పెళ్ళాంతో కాపురం చేసేది నీ కంప్యూటరుకు సమాచారం ఇస్తుందా! అని ప్రశ్నించారు.

నీ బ్రెయిన్లో ఫ్యూజులు ఎగిరాక Cognitive Impairment అనే ఆఖరిదశలో ఉన్నావు. భ్రాంతికిలోనై ఇలాంటి కధలు అల్లుతావా? నీ పిచ్చి ముదిరిందని ఎద్దేవా చేశారు. మా పార్టీ ప్లీనరీలో ఏర్పాటు చేస్తున్న భోజనాలపైనా చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. ప్లీనరీ ఘన విజయం తర్వాత కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి బోరున ఏడుస్తాడేమో..! అంటూ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో సింపుల్‌గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ఉన్నప్పటికీ ఆర్భాటాలకు దూరంగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రాధారణతో సాధారణంగా కనిపిస్తారు. అలాంటిది చంద్రబాబు తన వేలుకు ఉంగరం ధరించడం కార్తకర్తలో ఆసక్తి కలిగించింది. దీని గురించి అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఆ ఉంగరం వెనుక ఉన్న రహస్యాన్ని చంద్రబాబు వివరించారు. ఉంగరంలో కంప్యూటర్‌తో అనుసంధానించిన మైక్రో చిప్ ఉందని చెప్పారు. ఈ ఉంగరంతో చాలా ప్రయోజనాలున్నాయన్నారు. ఇది తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో పంపుతుందని తెలిపారు. హార్ట్ బీట్‌ను, నిద్రిస్తున్న తీరును నమోదు చేస్తుందన్నారు. తర్వాతి రోజు కంప్యూటర్‌లో నమోదైన వివరాల ఆధారంగా వైద్యులు తనకు సలహా ఇస్తారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాగే ప్రతి నాయకుడు, కార్యకర్త ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు హితోపదేశం చేస్తుందని వివరించారు. దీనికి విజయసాయి సెటైర్లు వేశారు.