శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేత

srisailam-dam

అమరాతిః శ్రీశైలం జలాయానికి వరద తగ్గుముఖం పడడంతో అధికారులు గేట్లను మూసివేశారు. నేడు ఉదయం 10 గంటల వరకు ఒక గేటు ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు వరద ప్రవాహం తగ్గడంతో ఒక గేటును కూడా మూసివేశారు.76,294 క్యూసెక్కుల నీరు వస్తుండగా కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 31,567 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్‌ వే ద్వారా 26,560 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల, సుంకేశుల నుంచి 24,968 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది . శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881,70 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. పూర్తిస్థాయి నీటి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు 197.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు 62, 638 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

గోదావరిలో క్రమంగా గోదావరి ప్రవాహం తగ్గుతుండడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. 5,200 క్యూసెక్కుల నీటిని పంట కాల్వలకు , 8.58 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురి సిన వర్షాలకు జలాశయానికి 4,622 క్యూసెక్కుల వరద వస్తుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సోమశిల జలాశయం పూర్తి నీటి నిల్వ 78 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 56 టీఎంసీలు గా ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/