కార్యకర్తలు సమక్షంలో వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు

వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా వైస్ అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర క్యాంపు వద్ద విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. లక్ష్మీదేవిపల్లి వద్ద కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో విజయమ్మ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు షర్మిల. షర్మిల పాదయాత్ర ఈరోజు 60వ రోజు చేరుకోవడమే కాదు.. రేగుళ్ల గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ లో ఎండలు దంచికొడుతున్నప్పటికీ..ఆ ఎండను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా షర్మిల పాదయాత్ర చేస్తుంది. నాయకులు, కార్యకర్తలు కూడా అదే ఉత్సాహంతో పాల్గొంటున్నారు. చాలా కాలం తర్వాత తెలంగాణలో పాదయాత్ర చేస్తూ.. దారిపొడవునా ప్రజలతో మాటా మంతీ జరుపుతూ.. కష్ట సుఖాలు తెలుసుకుని ఓదారుస్తూ ముందుకు సాగుతున్నారు. సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటున్న వారికి అండగా ఉంటానని భరోసా ఇస్తూ..తెరాస సర్కార్ ఫై నిప్పులు చెరుగుతున్నారు షర్మిల.