దీపాల వెలుగుతో కరోనా చీకట్లను తరిమేద్దాం

Today 9 PM 9 Minutes

రాత్రి 9గంటలకు యావత్‌ భారత్‌ ఒకటే మాట

కరోనా మహమ్మారిని తరిమికొట్టటానికి ఆదివారం ప్రజలందరూ సమాయత్తం అవుతున్నారు.

ప్రధాని పిలుపు మేరకు ఇవాళ ప్రజలు తమ తమ ఇళ్లలోని విద్యుత్‌ లైట్లన్నీ ఆఫ్‌చేసి, జ్యోతులు వెలిగించాలని ప్రధాని పిలుపు విదితమే.

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 9నిముషాలపాటు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి విద్యుత్‌లైట్లన్నీ ఆపివేసి జ్యోతులు వెలిగించి తమ దృఢ సంకల్పాన్ని వెల్లడించనున్నారు..

చమురుదీపాలు, కొవ్వొ త్తులు, టార్చిలైట్లు , సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌ లైట్స్ తో ఇలా ఏదొక రూపంలో కాంతిని వెలిగించి కరోనా అనే చీకటి మహమ్మారిని తరిమేద్దాం అన్న సంకల్పం చాటటం అత్యావశ్యకం..

జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని మరోమారు చాటుతూ మన విలువైన సమయంలో 9 నిముషాలు దేశంకోసం కేటాయించాల్సిన తరుణం మరికొద్ది గంటల్లో రాబోతోంది

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/