చంద్రబాబుకు శ్రీలంక లో పార్టీ పెట్టండి అంటూ విజయసాయి రెడ్డి సలహా

తెలుగుదేశం అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు శ్రీలంక లోపార్టీ పెట్టండి అంటూ వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సలహా ఇచ్చారు. చంద్రబాబు సలహాలు అమలు చేసినందుకే శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సే రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విపక్ష నాయకులు కూడా ముందుకు రాలేదు. గతంలో అమెరికాలో పార్టీ పెడితే టీడీపీ గెలుస్తుంది అన్నాడు పప్పు నాయుడు. ఇప్పుడు శ్రీలంక లో ట్రై చేస్తే అంతర్జాతీయ పార్టీ అవుతుంది అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

అలాగే రాష్ట్రంలో పొత్తుల ఫై విజయసాయి స్పందించారు. వైస్సార్సీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఓటమి భయంతో ఎవరికైతే ప్రజల మద్దతు లేదని అనుకుంటున్నారో వాళ్లే పొత్తుల కోసం చూస్తున్నారని చంద్రబాబు పై సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ఎన్నికల్లో గెలుస్తానన్న నమ్మకం లేదు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని, అసలు ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదన్నారు. పైగా బాబుది దుర్మార్గపు ఆలోచన.. ఎప్పుడూ ఇతరుల పైనే ఆధార పడే తత్వం.. పైగా వెన్నుపోటు పొడుస్తాడు అంటూ వ్యాఖ్యానించారు.