వివాదంలో విఘ్నేశ్‌శివ‌న్‌-న‌య‌న‌తార..

నయనతార , విఘ్నేష్ శివన్ దంపతులు ఆదివారం అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపిన సంగతి తెలిసిందే. స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు మ‌గ క‌వ‌ల పిల్ల‌ల‌కు జన్మనిచ్చారు. ఈ విషయాన్నీ ప్రకటించిన దగ్గరి నుండి సోషల్ మీడియా లో అంత దీనిగురించి మాట్లాడుకుంటున్నారు. అయితే న‌య‌న‌తార స‌రోగ‌సి అంశంపై వివాదం నెల‌కొంది.

ఈ అంశంపై త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్ర‌హ్మ‌ణ్యం స్పందిస్తూ..స‌రోగ‌సి వివ‌రాలు ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల క్రితం పెళ్లయిన జంట సరోగసీ ద్వారా గర్భం దాల్చగలరా..కాల ప‌రిమితి ఉందా..? అని మీడియా స‌మావేశంలో మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్యంను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ..న‌య‌న‌తార స‌రోగ‌సి అంశంపై తమ శాఖ వివరణ కోరుతుందని, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ విచారణకు ఆదేశిస్తామన్నారు.

అలాగే నటి కస్తూరి సైతం స‌రోగ‌సి ఫై పోస్ట్ పెట్టింది. వైద్య పరంగా అనివార్య పరిస్థితుల్లో తప్ప ఇండియాలో సరోగసీని బ్యాన్ చేశారు. 2022 జనవరి నుంచే ఇది అమల్లోకి వచ్చింది’ అంటూ కస్తూరి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.