దిల్ రాజు నిర్మాణంలోనే నా రెండో సినిమా – బలగం డైరెక్టర్ వేణు

మున్నా చిత్రం లో వేణు టిల్లు గా యావత్ సినీ ప్రేక్షకులను అలరించిన వేణు..తాజాగా బలగం మూవీ తో డైరెక్టర్ గా తన సత్తా చాటుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా తెలంగాణ నేపధ్య కథగా వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ తో వరుసగా అగ్ర నిర్మాతల నుండి చినన్ నిర్మాతల వరకు వేణు తో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమా ఫై క్లారిటీ ఇచ్చారు.

తన రెండో సినిమా కచ్చితంగా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. ఇప్పటికే రాజుకు ఓ కథ కూడా చెప్పానని తెలిపాడు. దానికి దిల్ రాజు కొన్ని సూచనలు చేశారన్నాడు. అవి తనకు కొత్త కిక్ ఇచ్చాయని తెలిపాడు. రాజు సూచనలకు అనుగుణంగా కథను తీర్చిదిద్దుతానని చెప్పాడు. ప్రస్తుతం బలగం సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన వేణు నటుడిగానూ కొనసాగుతానని స్పష్టం చేశాడు.