శ్రీశైలం ఆలయం మూసివేత
కరోనా కేసుల కారణంతో ఈవో నిర్ణయం

Srisailam : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్నిబుధవారం నుంచి మూసివేయనున్నారు. వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
ఆలయానికి చెందిన ఇద్దరు పరిచారికలు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా నిర్దారణ కావడంతో ఆలయ మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నారు.
దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో దర్శనాల నిలిపివేతకు ఆలయ ఈవో నిర్ణయాన్ని ప్రకటించారు.
అయితే స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/