కూరగాయలే మేలు!

ఆహారం – ఆరోగ్యం

Vegetables are good for health
Vegetables are good for health

అన్ని రకాల పోషకాలు అందాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా కూరగాయలు
ఎక్కువగా తినాలని డాక్టర్లు చెబుతుంటారు. తైవాన్‌కు చెందిన త్సుచీ యూనవర్సిటీ పరిశోధకులు ఆరోగ్యం మీద కూరగాయల భోజనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. నాన్‌వెజ్‌ తినేవారితో పోల్సితే వెజిటబుల్స్‌ తనేవారిలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు 16 శాతం తక్కువ ఉండడం గమనించారు.
వెజటేరియన్లలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తక్కువగా ఉండడానికి కారణం కూరగాయల్లో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్‌ ఈకోలి బ్యాక్టీరియా వృద్ధిని నియంత్రించడమే అని పరిశోధకులు గుర్తించారు. జీర్ణాశయంలో ఉండే ఈకోలి బ్యాక్టీరియా మూత్రనాళంలోకి చేరి మూత్రపిండాలు, మూత్రాశయం పనితీరును దెబ్బతీస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/