సులభంగా వెజ్‌పిజ్జా తయారీ

రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Veg. Pizza Making
Veg. Pizza Making

కావలసినవి:

మైదా- కప్పు, గోధుమపిండి- కప్పు, యాక్టివ్‌ డ్రైఈస్ట్‌- టేబుల్‌స్పూను, నీళ్లు- అరకప్పు, నూనె-1 1/2 స్పూన్లు, ఉప్పు-తగినంత, పంచదార- ముప్పావు స్పూను,

టొమాటోలు-400 గ్రా వెల్లుల్లి రెబ్బలు-2,ఎండుమిరపకాయ-1, మిరియాల పొడి-అర స్పూను, వెన్న-200గ్రా..క్యాప్సికం, ఉల్లి, బాదం, టొమాటో, పుట్టగొడుగుల ముక్కలు- కప్పున్నర, పిజ్జాసాన్‌- తగినంత.

తయారీ:

ముందుగా ఒక పాత్రను పొయ్యి మీద వేడి చేసి కిందకు దింపండి. అందులో గోరువెచ్చని నీటిని పోసి యాక్టివ్‌డ్రైఈస్ట్‌ను, తరువాత పంచదార వేసి నెమ్మదిగా కలియతిప్పండి. పది నిమిషాల పాటు కదలకుండా ఉంచండి.

ఈస్ట్‌ నుంచి నురుగు వచ్చాక గోధుమ పిండి, మైదాపిండి కలపండి. తరువాత నూనె, ఉప్పు వేయండి. తగినన్ని నీళ్లు కలుపుతూ ఐదారు నిమిషాలపాటు బాగా పిసుకుతూ పిండిని ముద్దలా కలపండి. పిండి మృదువుగా, సాగుతూ ఉండాలి.

పిండిని గుండటి బాల్‌లా చేసి, తేమ ఆరకుండా పైన నూనె రాయాలి. దాన్ని ఓవెన్‌లో పెట్టి 240 డిగ్రీల సెల్సియన్‌ వద్ద 25 నిమిషాల పాటు ఉంచాలి.

పిండిని బయటకు తీసి, పలుచగా ఒత్తుకోవాలి. పైన పిజ్జా సాస్‌ వేసి దానిపైన కూరగాయ ముక్కలను వేసుకో వాలి. 10 నిమిషాల పాటు కడాయిపై వేగించాలి.

చీజ్‌ బంగారం రంగులోకి మారి తే పిజ్జా తయారైనట్టే. కావలసిన ఆకారంలోకి కత్తిరించుకొని పిజ్జాను వేడివేడిగా ప్లేట్‌లో వడ్డించుకోవాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/