కరోనా భయంతో కొత్త సమస్యలు

‘మనస్విని’: మానసిక సమస్యలకు పరిష్కార వేదిక

New problems with corona fear
New problems with corona fear

మేడమ్‌, నా వయస్సు 56 సంవత్సరాలు. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెళ్ళిళ్లు అయ్యాయి. నేను, నా భర్త ఇంట్లోనే ఉంటున్నాం. కొవిడ్‌ వల్ల ఎక్కడికీ వెళ్లటం లేదు.

అందువల్ల చాలా భయంగా, ఆందోళనగా, విసుగ్గా ఉంది.

ఈ బాధలవల్ల ఆరోగ్యం పాడైపోతోంది. కాళ్లలో మంటలు, తలనొప్పి వంటివి వస్తున్నాయి

ఇంతకు ముందు ఇలాంటివి లేవ్ఞ. నేను మరల ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కొంచెం విరించండి ప్లీజ్‌. నళిని, వరంల్‌

మీరు తప్పక మరల తిరిగి ఆరోగ్యంగా ఉండగలరు. ఇందులో సందేహం లేదు. ఆందోళన, భయం వద్దు. హుషారుగా ఉండండి. ఉత్సాహంగా ఉండండి.

మంచి కాలక్షేపంతో ఆనందంగా ఉండండి. మంచి ఆనందాన్నిచ్చే పనులు చేసుకోండి.

ప్రతి నిమిషం ఆనందంగా గడపాలి. ఇది తప్పనిసరి. ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థయి ర్యంతో ఉండాలి. కౌన్సెలింగ్‌ తప్పక తీసుకోండి.

అప్పుడు, వృత్తినిపుణుల సలహాలు చాలా ఉపయోగపడతాయి. అశ్రద్ధ చేయకుండా, మీ పరిస్థితిపై అవగాహన పెంచుకొని, తగు చర్యలు తీసుకోండి.

ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మంచి విశ్రాంతి, మంచి ఆలోచనలు, మంచి అనుభూతులు మీ సొంతం చేసుకోండి.

అప్పుడు జీవితం ఎంతో ఆనందంగా మీకు అనిపిస్తుంది.

వర్తమానంలో జీవించండి. భవిష్యత్‌ గురించి ఆలోచనలు ఆందోళనతో కూడి ఉండకూడదు. ఆశావహంగా ఉండాలి. జీవితంలో ఆనందించటానికి ఎన్నో ఉన్నా యి.

రూపాయి ఖర్చు లేకుండా ఎంతో ఆనందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

ప్రకృతిని చూసి పరవశించండి. జీవననైపుణ్యాలు నేర్చుకోండి.

జీవితంలో మంచిని ఎంత నేర్చు కొంటే, అంతమంచిది. అపుడు సమయం వృధా అవ్వదు.

సద్వినియోగం అవ్ఞతుంది. ప్రతిక్షణం విలువైంది. దానిని గ్రహించండి. ఆనందంగా ఉంటే, ఆరోగ్యం బాగా ఉంటుంది.

ఆస్తులతో సమస్యలొస్తున్నాయి

మేడమ్‌ నమస్కారం. నా వయస్సు 62 సంవత్సరాలు. నా భర్త ఈ మధ్యనే పోయారు. ఆస్తుల పరిరక్షణ చాలా కష్టంగా ఉంది.

మాకు పొలాలు ఉన్నాయి. దానివల్ల మాకు కొన్ని ఇబ్బందులు ఎదురవ్ఞతున్నాయి.

అంతేకాక ఇంటి బాధ్యత అంతా నామీద పడింది. ఇదంతా తలచుకుంటే, చాలా సమస్యగా అనిపిస్తోంది. నిద్రపట్టడం లేదు.

నేను మరల తిరిగి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? కొంచెం వివరించండి ప్లీజ్‌. భవాని, హైదరాబాద్‌

మీరు తప్పక ఈ సమస్యల నుండి బయట పడగలరు. జీవితంలో ఆనందం వందపాళ్లు ఉంటే, సమస్యలు రెండుపాళ్లు ఉంటాయి.

అంటే ఆనందం చాలా ఎక్కువ. సమస్యలు చాలా తక్కువ. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి.

వాటి గురించి దిగులు చెందవద్దు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. జీవితం అమూల్యమైనది. దాని విలువ గ్రహించండి.

అప్పుడు మీ పొలం సమస్యలను కూడా తేలిగ్గా పరిష్కరించు కోగలరు. జీవితంలో వివేకం, స్పష్టత ముఖ్యం.

అవగాహనతో అన్ని రకాల సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు.

సందిగ్ధంతో, భయంతో ఆందోళనతో సమస్యలు పరిష్కరిం చుకోవటం చాలా క్లిష్టంగా ఉంటుంది

. అయినా సమయా న్ని సద్వినియోగం చేసుకొని, ఆనందంగా, ప్రశాంతంగా జీవితాన్ని మలచుకోవాలి.

ఇది తప్పక చేయాలి. అంతేగానీ, విచారంగా, దిగు లుగా సమయాన్ని దుర్వినియోగం చేయ వద్దు.

ఒక్క సమస్యకు అనేక రకాల పరిష్కార మార్గా లు అందుబాటులో ఉంటాయి.

వాటిలో మీకు అను కూలమైన మార్గాన్ని ఎంచుకొని, పరిష్క రించుకోండి.

సమస్యలను అప్పుడు అన్ని బాగుంటాయి. అన్ని సర్దుకుంటాయి.

-డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/