ఓటిటి లోకి వరుణ్ తేజ్ ‘గని’

ఈ నెల 22న ప్రసారం

Varun Tej 'ghani' movie into OTT
Varun Tej ‘ghani’ movie into OTT

తెలుగు ఓటీటీ ‘ఆహా’లో యాక్షన్‌ ఫ్యామిలీ డ్రామా ‘గని’ విడుదలకు సిద్ధమవుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, సాయి మంజ్రేకర్‌, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర , నవీన్‌ చంద్ర, జగపతిబాబు, నదియ లీడ్‌  రోల్స్ లో నటించిన సినిమా ‘గని’. ప్రతి శుక్రవారం సరికొత్త కంటెంట్‌తో ‘ఆహా’ అలరిస్తోంది.

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘గని’. తమన్‌ సంగీతం అందించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన సినిమా ఇది. ‘గని’ సినిమా విడుదలకు సంబంధించి పవర్‌ ప్యాక్డ్ యాక్షన్‌ ప్రోమోతో అనౌన్స్ చేశారు ‘ఆహా’ టీమ్‌. ఏప్రిల్‌ 22న  ప్రసారం కానుంది. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ మునుపెన్నడూ కనిపించని అవతార్‌లో ఇందులో కనిపిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్‌కి పడ్డ కష్టమంతా, అందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/