తల్లి మేనకాగాంధీ తరపున వరుణ్‌ గాంధీ ఎన్నికల ప్రచారం

Varun Gandhi election campaign on behalf of mother Maneka Gandhi

న్యూఢిల్లీః దేశంలో తమ ఎంపీని అమ్మా అని పిలిచే ఒకే ఒక్క నియోజకవర్గం సుల్తాన్‌పూర్‌ అని బీజేపీ సీనియర్‌ నాయకుడు వరుణ్‌గాంధీ అన్నారు. తన తల్లి మేనకాగాంధీ తరపున గరువారం ఆయన సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

దేశంలోని ఏ లోక్‌సభ నియోజకవర్గంలోనైనా తమ ప్రజాప్రతినిధిని ‘మా ఎంపీ’ అని చెబుతారని, కానీ ఒక్క సుల్తాన్‌ పూర్‌ నియోజకవర్గంలో మాత్రం తమ ఎంపీని ‘అమ్మా’ అంటారని వరుణ్‌గాంధీ చెప్పారు. నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది నా తల్లి తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి కాదని, సుల్తాన్‌ పూర్‌ నియోజకవర్గ ప్రజల తల్లి తరఫున ప్రచారం చేసేందుకు వచ్చానని అన్నారు.

కాగా, 2024 ఎన్నికల్లో వరుణ్‌గాంధీకి బీజేపీ టికెట్‌ నిరాకరించింది. పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఈసారి ఆయనను పోటీకి దూరం పెట్టింది. దీనిపై మేనకాగాంధీని మీడియా ప్రశ్నించగా.. పార్టీని నడిపేది కేవలం ఎంపీలు కాదని వ్యాఖ్యానించారు. ఒక పార్టీకి ఎంపీలు కేవలం మూడు, నాలుగు వందల మంది మాత్రమే ఉంటారని, వాస్తవానికి పార్టీని నడిపేది కార్యకర్తలని అన్నారు.

కాగా, సుల్తాన్‌ పూర్‌ లోక్‌సభ స్థానానికి లోక్‌సభ ఆరో దశ ఎన్నికల్లో భాగంగా మే 25న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 1న జరిగే ఏడో దశ పోలింగ్‌తో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియనుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.