‘మా’ వార్ ఇప్పట్లో చల్లారేలా లేదు..

మా ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా మా వార్ చల్లారడం లేదు. మా ఫలితాలు రాగానే పలువురు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం..మరికొంతమంది హెచ్చరికలు జారీ చేయడం చేసారు. ఎన్నికల బరిలో నిల్చుని ఓడిపోయినా ప్రకాష్ రాజ్..తాజాగా మరో బాంబ్ పేల్చాడు.

త‌న రాజీనామా వెనుక ఓ లోతైన అర్థమే ఉందంటూ.. ఓ ట్వీట్ చేసారు..‘మాకు మద్దతుగా నిలిచిన ‘మా’ సభ్యులకు నమస్కారం. నేను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉంది. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా’..మాకు అందించిన ప్రేమాభిమానాల విషయంలో మన టీం ఎంతో బాధ్యతగా ఉంది. అలాంటి వారిని ఎప్పుడూ నిరాశపరచం’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ తో మరోసారి చిత్రసీమలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రకాష్ రాజ్ ని ఎవరైనా బలవంతంగా రాజీనామా చేయమని చెప్పారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు వాడిని కాకపోవడం నా తప్పు కాదంటూ రాజీనామా చేసేశారు. కానీ, ఆయన రాజీనామాను ఆమోదించలేదు నూత‌న అధక్ష్యుడు మంచు విష్ణు. ఎన్నికల స‌మ‌యంలో ఎన్నో అనుకుంటాం..అవన్నీ అక్కడితోనే మర్చిపోవాలి. మీరు పెద్దవారు. మీ స‌పోర్టు నాకు కావాలి. త్వరలోనే మిమ్మల్నీ డైరెక్టుగా కలిసి మాట్లాడతాను అని విష్ణు తెలిపారు.