ఉపరాష్ట్రపతి ని పట్టుకుని వర్మ సంచలన ట్వీట్ ..నెటిజన్లు ఆగ్రహం

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..నిత్యం ఏదో ఒక పోస్ట్ చేసి వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఉపరాష్ట్రపతి ని పట్టుకుని కొరియర్ బాయ్ అంటూ ట్వీట్ చేసి నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాడు. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక సోమవారం ఢిల్లీ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధి గా హాజరై , విజేతలకు అవార్డ్స్ అందజేశారు.

ఇదే వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకునేందుకు తమ కుటుంబంతో కలిసి అవార్డుల వేడుక కు హాజరయ్యారు రజని. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు… ఈ అవార్డును సూపర్ స్టార్ రజనీకాంత్ కు అందజేసి అభినందించారు. రజనికి ..వెంకయ్యనాయుడు అవార్డు అందజేయడం పట్ల వర్మ సంచలన ట్వీట్ చేసాడు.

“సూపర్ స్టార్ రజినీకాంత్ కు కొరియర్ మ్యాన్ ద్వారా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది” అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసాడు. అయితే రామ్ గోపాల్ వర్మ వెంకయ్యనాయుడు పై చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉపరాష్ట్రపతి ని పట్టుకుని ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు.

Here is ⁦@rajinikanth⁩ giving award to Dada saheb Phalke through a courier man pic.twitter.com/AxKkre4Aay— Ram Gopal Varma (@RGVzoomin) October 25, 2021