దేశంలో కొత్తగా 1968 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్‌ నుంచి తాజాగా 3,481 మంది కోలుకోగా.. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 34,598కి చేరాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.94శాతంగా ఉందని, వీక్లీ పాజిటివిటీ రేటు 1.29శాతంగా ఉందని వివరించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4,45,99,466కు పెరగ్గా.. మొత్తం 4,40,36,152 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో 5,28,716 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు దేశంలో 218.80కోట్ల కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/