రాష్ట్రపతి సమావేశం అనంతరం సంచలన విషయాలు బయటపెట్టిన చంద్రబాబు

ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన విషయాలు బయటపెట్టారు. ఏపీలో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతోందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి ఆస్ట్రేలియా వరకూ డ్రగ్స్ ఎగుమతి అవుతున్న విషయం బయట పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ నాసిరకం మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని బ్రాండ్లను ఏపీలో అమ్ముతున్నారని అన్నారు. అభివృద్ధిలో నెంబర్వన్ గా ఉన్న ఏపిని జగన్ డ్రగ్స్ లో నెంబర్ వన్ లో చేశాడని సంచలన ఆరోపణలు చేశారు.

ఏపీ లో మాదక మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని… రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు చంద్రబాబు. అలాగే… .అక్టోబర్ 19 న జరిగిన ఘటనల పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అధికారపార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న డీజీపీ నీ రీకాల్ చేయాలని రాష్ట్రపతిని కోరారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ లో లిక్కర్ ,డ్రగ్స్ మైనింగ్, సాండ్, మాఫియా విస్తరించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు చంద్రబాబు. న్యాయ, మీడియా తో సహ అన్ని వ్యవస్థల పైన దాడులు జరుగుతున్నాయని.. రాష్ట్రపతి ని టీడీపీ బృందం తరపున నాలుగు ప్రధాన డిమాండ్స్ కోరామని వివరించారు.

టీడీపీ ఫిర్యాదుపై రామ్‌నాథ్ కోవింద్‌ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పరిస్థితిపై వాకబు చేస్తామన్నారు. టీడీపీ నేతలు చెప్పినవన్నీ చాలా సీరియస్ అంశాలని అన్నారు. వీటన్నింటినీ పరిశీలనకు తీసుకుంటామన్నారు.