గరికపాటి వ్యవహారంలో అనుష్కను లాగిన వర్మ

గరికపాటి నరసింహారావు ను ఇప్పట్లో వర్మ వదిలేలా కనిపించడం లేదు. ప్రతి రోజు ఏదొక ట్వీట్ చేసి ఈయన్ను వార్తల్లో నిలిచే చేస్తున్నాడు. రీసెంట్ గా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిరంజీవి తో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు , ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను గరికపాటి , చిరంజీవి లైట్ తీసుకున్నప్పటికీ, వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈ ఇష్యూ ఫై ట్విట్టర్ లో ఏదొక రకంగా ట్వీట్ చేస్తూ ఈ ఇష్యూ ను అంత మాట్లాడుకునేలా చేస్తున్నాడు. ఇప్పటికే పలు ట్వీట్స్ చేసిన వర్మ..తాజాగా అనుష్క ను సైతం ఇందులోకి లాగాడు.

ఓ పాత వీడియోను వర్మ పోస్ట్ చేసి గ‌రిక‌పాటిని టార్గెట్ చేశాడు. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముందంటే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన అనుష్క గురించి గ‌రిక‌పాటి గ‌తంలో మాట్లాడిన వీడియో. తాను ఓ రోజు సోఫాలో కూర్చొని పేప‌ర్ చ‌దువుతుండ‌గా, కింద త‌న కాళ్ళ ద‌గ్గ‌ర కూర్చున్న త‌న కొడుకు ఓ మ్యాగ‌జైన్‌లో అనుష్క ఫొటో చూస్తుండ‌గా, ఆ ఫొటోను తాను కూడా చూశాన‌ని, అనుష్క‌ను చూసి తానే ఆక‌ర్షితుడ్ని అవ‌గా, త‌న కొడుకు ఆక‌ర్షితుడు అవ‌డం పెద్దగా ఆశ్చ‌ర్యం అనిపించ‌లేద‌ని గ‌రిక‌పాటి అన్నారు.

గ‌రిక‌పాటి అన్న ఆ వీడియో ను వర్మ త‌న ట్విట్ట‌ర్‌లో రెండు సార్లు షేర్ చేసి “ఓహో,ఆహా,అడ్డెడ్డే”, “ఓహో మీరు కూడానా (గ‌రిక) బ‌లి (పాటి) గారూ! అంటూ త‌న‌దైన శైలిలో వ్యంగ్యంగా క్యాప్షన్స్‌ పెట్టాడు. దీంతో ఇప్పుడు ఈ వివాదం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగేలా క‌నిపిస్తోంది.