కొడాలి నాని ఫై రావి వెంకటేశ్వరరావు ఫైర్

వైస్సార్సీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. రీసెంట్ గా కొడాలి నాని బాలకృష్ణ ఫై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహానటుడు ఎన్టీఆర్‌ మరణించి 25 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ చంద్రబాబు షోల పేరుతో ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తూ క్షోభ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. బాలకృష్ణ కు తండ్రి చావుకు కారణమైన చంద్రబాబు ఫ్యామిలీతో షోలు చేయడానికి సిగ్గు ఉండాలంటూ నాని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలఫై రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసారు.

బాలకృష్ణ కాలిగోటికి కూడా కొడాలి నాని సరిపోడని , సిగ్గు, లజ్జ లేకుండా బాలకృష్ణ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పట్లో లక్ష్మీపార్వతి ఏం చేసిందో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, పార్టీ సీనియర్ నేతలందరికీ తెలుసని చెప్పారు. నందమూరి హరికృష్ణ పేరు చెప్పుకుని కొడాలి నాని లక్షలు దోచుకుతిన్నారని ఆరోపించారు. ఏ అర్హతతో ఎన్టీఆర్ కుటుంబం గురించి కొడాలి నాని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా ఉందని రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వెయ్యి కోట్ల అవినీతి సొమ్మును విశాఖలో పెట్టుబడిగా పెట్టారని అన్నారు. నాని పెట్టుబడులపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. కొడాలి నానికి చరమగీతం పాడేందుకు గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.