ఇయర్‌ బడ్స్‌ను ఇలా కూడా వాడొచ్చు..

చెవిలో ఉయోగించే ఇయర్‌బడ్స్‌ అందరి ఇళ్లలోను దాదాపుగా ఉంటాయి. అయితే వాటిని కేవలం అందుకోసమే కాకుండా మరికొన్ని విధాలుగా కూడా వాడవచ్చు. కనుబొమలు చేయించుకున్నప్పుడు కొందరికి వాటి దగ్గర మంట, నొప్పిగా ఉంటుంది.

అటువంటప్పుడు ఇయర్‌ బడ్స్‌ని ఆలివ్‌ నూనెలో ముంచి కనుబొమల మీద నెమ్మదిగా మర్దన చేస్తున్నట్లుగా రాయాలి. అలా రెండు మూడు రోజుల పాటు వాటితో మర్దన చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. మేకప్‌ వేసుకునే క్రమంలో బ్రష్‌లాగా కూడా వాడవచ్చు.

ముక్కు, కనుబొమల మధ్యలో కొన్నిసార్లు ఫౌండేషన్‌, పౌడర్‌ సరిగా అంటుకోదు. అలాంటి చోట్ల ఇయర్‌బడ్స్‌తో ఫౌండేషన్‌, పౌడర్‌ రాసి చుట్టు చక్కగా అంటుకునేలా అద్దితే బాగుంటుంది. కళ్ల కింద మచ్చలు, వాపు కనిపించకుండా కన్సీలర్‌ని వాడతాం. అలాంటప్పుడు చేత్తో రాస్తే చక్కగా రాదు. అటువంటప్పుడు ఇయర్‌ బడ్‌తో కన్సీలర్‌ని తీసుకుని పెన్నుతో అద్దినట్లు దాన్ని దిద్దుకుంటే బాగుంటుంది.

కాటుక పెట్టుకునేందుకు లేదా తుడిచేందుకు కూడా ఇయర్‌బడ్స్‌ను వాడవచ్చు. అలాగే మస్కారా ఇతరత్రా అలంకరణను కూడా ఈ ఇయర్‌ బడ్‌తో తీసేస్తే పూర్తిగా పోతుంది.
నెయిల్‌ పాలిష్‌ వేసుకునేటప్పుడు ఒక్కోసారి చర్మం మీదికి వస్తుంది. అటువంటప్పుడు ఇయర్‌బడ్‌తో దాన్ని తుడిచేసి సరిచేసుకోవచ్చు.

పెదవులకు లిప్‌స్టిక్‌ వేసుకునేప్పుడు అవుట్‌లైన్‌ గీసినప్పుడు గీత దాటి బయటకు వస్తుంది. అటువంటప్పుడు ఇయర్‌బడ్‌తో తుడిచేస్తే స్పాంజి లాంటివి వాడాల్సిన పని ఉండదు. ఇయర్‌బడ్‌తో సులువుగా, చక్కగా పోతుంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com