బాహుబలి రికార్డులను పాతాళానికి తొక్కేసిన వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ కాగా, ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. తొలిరోజు ఈ సినిమాను చూసేందుకు జనం పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కట్టారు. ఇక బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ మేనియా మామూలుగా లేకపోవడంతో ఈ సినిమా తొలిరోజు అదిరిపోయే కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓ చోట మాత్రం వకీల్ సాబ్ ఏకంగా బాహుబలి 2 రికార్డును దాటేసిందని తెలుస్తోంది. ఖమ్మంలో బాహుబలి 2 చిత్రం తొలిరోజు ఏకంగా రూ.22.28 లక్షలు కలెక్ట్ చేయగా, ఇప్పుడు వకీల్ సాబ్ ఆ రికార్డును అధిగమించాడు. తొలి రోజు ఏకంగా రూ.30.31 లక్షలు కలెక్ట్ చేస పవన్ తన పవర్ ఏమిటో చూపించాడు.

దీంతో బాహుబలి 2 రికార్డు పటాపంచెలయ్యిందని పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్‌ను అల్లాడించినట్లు రిపోర్టులు వస్తున్నాయి. మొత్తానికి మూడేళ్ల గ్యాప్ తరువాత పవన్ బాక్సాఫీస్‌పై తన పంజా విసిరాడని చెప్పొచ్చు.