హాస్పటల్ లో సమంత సిస్టర్

Kalpika Ganesh on hospital bed

ఈ మధ్య సినీ నటి నటులంతా అనారోగ్యానికి గురవుతూ హాస్పటల్ బాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు హాస్పటల్ లో చేరగా..తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ కల్పిక గణేష్ హాస్పటల్ బెడ్ ఫై ఉన్న పిక్ ను షేర్ చేసి అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతకు అక్క పాత్రలో నటించిన నటి అంటే మాత్రం అందరికీ వెంటనే గుర్తుకు వస్తుంది. హీరోయిన్ సమంతలాగే తాను కూడా 13 ఏళ్లుగా మయోసైటిస్ తొ పోరాడుతున్నట్లు తెలిపింది.

లుంబార్ రాడిక్యూలో పథి విజయవంతమైందని తెలిపింది. నా పోరాటం చివరికి ఎలాంటి సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి అని రాసుకొచ్చింది. రాడిక్యులర్ పెయిన్ కు ఆమె ఈ చికిత్స చేయించుకుంది. రాడిక్యులర్ పెయిన్ అంటే వెన్నుముక నుంచి నడుము, తొడలు, పాదాల వరకు తీవ్రంగా నొప్పి ఉంటుందని తెలిపింది.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ..ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడి పడి లేచే మనసు, యశోద చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.