స్వాతిముత్యం ట్రైలర్ రిలీజ్

బెల్లం కొండ గణేష్ హీరోగా నటిస్తున్న స్వాతిముత్యం మూవీ ట్రైలర్ విడుదలైంది. స్వాతిముత్యం మూవీ తో బెల్లం కొండ గణేష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గణేష్ హీరోగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వాతి ముత్యం అనే సినిమాను నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో.. లక్ష్మణ్.కె. కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు జరుపుకుంటుంది.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. ఇప్పటికే పలు పాటలు విడుదలై ఆకట్టుకోగా..సోమవారం చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి పెంచారు. ట్రైలర్‌ చూస్తుంటే.. సినిమా మొత్తం.. హీరో పెళ్లి చుట్టే తిరిగినట్లు కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యిందని , అటు కామెడీ కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

YouTube video