సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. సిఎం షెడ్యూల్‌ ప్రకారం..ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితో మరో రెండు మూడు గంటల్లో ఢిల్లీకి బయల్దేరాల్సి ఉండగా ఆ పర్యటన రద్దు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. పర్యటనలో భాగంగా మొదట కేంద్ర మంత్రి అమిత్ షాతో.. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో భేటీ కావాల్సి ఉంది. అయితే కాసేపట్లో సిఎం‌ ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో సిఎం పర్యటన వాయిదా పడింది. వాయిదా పై కారణాలు తెలియాల్సి ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/