అగ్రరాజ్యంలో కరోనా మరణాలు 3 యుద్ధాలకు సమానం

5 లక్షలు దాటిన మృతుల సంఖ్య

బాల్టిమోర్‌: సోమవారం శ్వేతసౌధంలో కరోనా మృతులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో దేశ ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా పాల్గొన్నారు. కాగా, అమెరికాలో కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. ఆ దేశం పాల్గొన్న, జరిపిన మూడు యుద్ధాలలో మరణించిన అమెరికన్ల సంఖ్యతో ఇది సమానం. రెండో ప్రపంచ యుద్ధంలో 4.05 లక్షలు, వియత్నాం యుద్ధంలో 58 వేలు, కొరియా యుద్ధంలో 36 వేల మంది అమెరికన్‌ సైనికులు మృతిచెందారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో దాదాపు 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 20 శాతం అమెరికాలోనే మృతిచెందారు. 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ విచారం వ్యక్తం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/