కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలో కాల్పులు

అమెరికా లో మరోసారి తుపాకీ కాల్పుల మోత మోగింది. గురుద్వారాలో ఇద్దరు వ్యక్తులు..ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న 2.30 గంటల సమయంలో తుపాకీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తుల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనపై ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. మత విద్వేషాల కారణంగా ఈ కాల్పులు జరగలేదని… ఒకరికొకరు బాగా తెలిసిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందని… పాత వివాదాలే ఈ ఘటనకు కారణమని తెలిపారు.

కాగా ఈ ఘటన లో మొత్తం ముగ్గురు ఉన్నారు. వీరిలో ఇద్దరు స్నేహితులు కాగా… మరొకరు ప్రత్యర్థి. వీరు ముగ్గురూ ఒకరికొకరు తెలుసు. గాయపడిన ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత ఏడాది అమెరికాలో తుపాకీ కాల్పుల కారణంగా దాదాపు 44 వేల మంది మృతి చెందడం జరిగింది. వీటిలో హత్యలు, ఆత్మహత్యలు, సెల్ఫ్ డిఫెన్స్ సమయంలో జరిగిన పొరపాట్లు ఇలా అన్ని ఉన్నాయి.