విస్మయానికి గురైన ట్రంప్‌ సహాయకుడు

వావ్‌ అంటూ ట్వీట్‌ చేసిన డాన్‌ స్కావినో జూ.

Trump aide Dan scavino jr
Trump aide Dan scavino jr

అహ్మదాబాద్‌: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో రోడ్డుకిరువైపులా ఉన్న జన సందోహాన్ని చూసి ట్రంప్‌ సహాయకుడు డాన్‌ స్కావినో ఆశ్చర్యపోయారు. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్ కు అత్యంత ఘనమైన స్వాగతం లభించింది. అనంతరం ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తుండగా రోడ్డుకిరువైపులా లక్షల మంది నిల్చుని ట్రంప్ కు ఆహ్వాన వచనాలు పలుకుతూ కనిపించారు. ఈ దృశ్యాన్ని చూసి ట్రంప్ సహాయకుడు డాన్ స్కావినో జూనియర్ విస్మయానికి గురయ్యారు. ‘వావ్’ అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ‘నమస్తే ట్రంప్’ కు ఇంతటి విశేషాదరణా! అంటూ ట్వీట్ చేశారు. వాస్తవానికి ట్రంప్ కొన్నిరోజులుగా తనకు భారత్ లో నమ్మశక్యం కాని రీతిలో స్వాగతం లభిస్తుందని అంచనాలు వేయడమే కాదు, దీనిపై ప్రకటనలు కూడా చేశారు. ఇప్పుడాయన అంచనాలకు మించడంతో సహాయక బృందం కూడా సంతోషం పట్టలేకపోతోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/