సామాన్యులఫై పెను భారం..వారం రోజుల్లో సిలిండర్ ధర రూ.100 పెరగబోతుంది

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ , డీజిల్ ధరలతో సామాన్యలు నానా కష్టాలు పడుతున్నారు. పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతుండడం తో నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. ఏ వస్తువైనా ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. అమాంతం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యుల ఫై మరో భారం పడబోతున్నట్లు తెలుస్తుంది. అదే గ్యాస్ భారం.

ఇంకొక వారం రోజుల్లో వంట గ్యాస్ ధర మరో రూ.100 పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నష్టాలను తగ్గించుకునే క్రమంలోనే చమురు కంపెనీలు ధరల్లో మరోసారి పెంపు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ సారి మాత్రం గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తేనే ధరలు పెరగనున్నాయి. ఒకవేళ ఈ సారి కూడా ధరలు పెరిగాయంటే అది ప్రభుత్వం పెంచినట్లే. చమురు సంస్థలు అక్టోబర్ 6న వంటగ్యాస్‌ సిలిండర్‌కు రూ.15 చొప్పున పెంచాయి. జులై నుంచి అక్టోబరు 6 వరకు దీని ధర రూ.90 వరకూ పెరిగింది.

గతేడాది నుంచే ఎల్పీజీపై కేంద్రం రాయితీలు తొలగించింది. పెట్రోల్, డీజిల్ మాదిరి ఎల్పీజీ ధరపై నియంత్రణ ఎత్తేస్తున్నట్లు అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. పెరుగుతున్న వంటగ్యాస్ ధరల అంతరాన్ని భరించేందుకు కూడా కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ భారాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేకుంటే వినియోదారులపై మోపేందుకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నాయి.