మరోసారి అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా పాజిటివ్‌

joe Biden-Vaccination for all adults from 19
US President Joe Biden Tests Positive For Covid Again

వాషింగ్టన్‌ః మరోసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. వైరస్‌ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్‌కు మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్‌ ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని వైట్‌హౌస్ వర్గాలు ప్రకటించాయి. 79 ఏండ్ల బైడెన్ గతేడాదే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారు. బూస్టర్‌ డోస్‌ కూడా వేయించుకున్నారు. అయినప్పటికీ.. రెండుసార్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. గత నెల 21న బైడెన్‌కు తొలిసారిగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైరస్ తీవ్రత పెద్దగా లేకపోవడం స్వల్ప లక్షణాలు ఉండటంతో ఐసొలేషన్‌లో ఉంటూనే అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. అయితే వైరస్‌ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే మహమ్మారి మళ్లీ తిరగబెట్టడం విశేషం.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/