కనిపించని ఈస్టర్ సందడి
లైవ్ స్ట్రీమింగ్‌లో పోప్ ప్రాన్సిస్ సందేశం

వాటికన్‌సిటి: ఈస్టర్ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. ఎంతో మంది భక్తులతో కిక్కిరిసిపోయే చర్చ్‌లు సైతం బోసిపోయి కనిపించాయి. ఈస్టర్ సందర్బంగా క్రైస్తవులంతా ఇళ్లలోనే ప్రార్దనలు చేసుకున్నారు. వాటికన్సిటిలో సైతం ఇదే కనిపించింది. ఈ సంవత్సరం పోప్ ప్రాన్సిస్ ఈస్టర్ సందేశాన్ని లైవ్ స్ట్రీమింగ్‌లో ఇచ్చారు. సేయింట్ పీటర్ చర్చ్‌లో ప్రార్దనలు నిర్వహించిన అనంతరం ప్రాన్సిస్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ఎందరో మరణించారని , మరెందరో తమకు ఇష్టమైన వారిని కోల్పోయారని అన్నారు. ప్రపంచదేశాలు అన్ని కలిసి దీనిపై పోరాటంచేయాలని పిలుపునిచ్చారు. ఏసు దయతో త్వరలోనే మహామ్మారిపై ప్రజలు విజయం సాధిస్తారని ఆకాంక్షించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/