కరోనా ఎఫెక్ట్‌… అమెరికా కీలక నిర్ణయం

0.25 శాతంగా ఉన్న వడ్డీ రేటును సున్నా శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు

america
america

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను గడగడలాడిస్తుంది. ఈనేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కనిష్ఠ స్థాయిలో 0.25 శాతంగా ఉన్న వడ్డీ రేటును సున్నా శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం నాడు అత్యవసరంగా సమావేశమైన యూఎస్ పెడ్, కరోనా ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. 2008లో లీమన్ బ్రదర్స్ దివాలా తరువాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, అమెరికా వడ్డీ రేట్లను సున్నా శాతానికి మార్చింది. ఆపై మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. యూఎస్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారకుండా 700 బిలియన్ డాలర్ల ట్రెజరీ నిధులను వెచ్చించనున్నట్టు కూడా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/