కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ తీసుకున్నవారికి అనుమతి లేదు

భారత ప్రయాణికులపై వివిధ దేశాల ఆంక్షలు

Gulf countries airport
Gulf countries airport

దేశంలో మరో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతోంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌టన నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి దేశాలు భారత దేశంపై బ్యాన్ విధించాయి. ఇక్కడ నుంచి ఎవరినీ ఆ దేశాల‌కు అనుమతించటం లేదు. ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్‌ వ్యాక్సిన్లు తీసుకున్న వారు మాత్ర‌మే ఆయా పత్రాలను ఎయిర్‌లైన్స్‌కు సమర్పించిన తర్వాతే త‌మ దేశంలోకి అనుమతిస్తామని సౌదీ అరేబియా ఇప్పటికే ప్ర‌క‌టించింది. అంతేకాదు, దుబాయ్‌, ఖతార్ లాంటి దేశాలు కూడా ఈ ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని యోచిస్తున్నాయని తెలిసింది. ఇదిలా ఉండగా మ‌న దేశంలో త‌యారైన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ ను ఏ దేశం కూడా టీకా కింద గుర్తించ‌లేదు. డ‌బ్ల్యూహెచ్‌వో కూడా త‌న జాబితాలో వెల్లడించలేదు. దీంతో కొవాగ్జిన్ తీసుకున్న మ‌న దేశ ప్రజ‌ల ప్ర‌యాణాల‌కు ఆటంకం ఏర్పడుతుందని తెలుస్తోంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/