ప్రమాదవశాత్తు పట్టాలు తప్పిన రైలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైలు పట్టాలు తప్పింది. అమృత్‌సర్‌ నుండి జయనగర్‌ వెళ్తున్న రైలు ప్రమాదవశాత్తు లక్నో డివిజన్‌లోని బార్‌బాగ్‌ స్టేష్టన్‌ వద్ద పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురుయ్యారు. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న రైల్వే అధికారులు పరిస్థితిని సమీక్షించారు. అయితే రెండు బోగీలు మాత్ర‌మే ప‌ట్టాలు త‌ప్పాయ‌ని, వాటిలో 155 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. ప్ర‌యాణికుల‌కు ఎలాంటి గాయాలు కాలేద‌న్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌పై విచార‌ణ‌కు క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు డీఆర్ఎం సంజ‌య్ త్రిపాఠి పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/